టీడీపీకి మరో షాక్

Update: 2019-06-24 08:14 GMT

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్ చేసిన వ్యవహారం కలకలం రేపుతుండగా..తాజాగా మరో నేత ఆ పార్టీకి ఝలక్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ. ఆయన బిజెపి గూటికి చేరేందుకు వీలుగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలినట్లు అయింది. మాజీ ఎమ్మెల్యేలే కాకుండా..మాజీ మంత్రులు..సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బిజెపిలోకి వెళతారని గత కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

 

 

 

Similar News