గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం తర్వాత ఎమ్మెల్సీ నారా లోకేష్ శుక్రవారం నాడు అసెంబ్లీ లాబీల్లో హల్ చల్ చేశారు. ఆయన కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కావటంతో శుక్రవారం నాడు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నారా లోకేష్ అసెంబ్లీకి వచ్చారు.
అసెంబ్లీలో ఆయన తనకు ఎదురుపడిన మంత్రులు..ఎమ్మెల్యేలకు అభినందనలు తెలుపుతూ ముందుకు సాగారు. అదే సమయంలో లోకేష్ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కరచాలనం చేసి మాటలు కలిపారు. మంత్రులు ఆదిమూలం సురేష్, అంజాద్ బాషాలకు లోకేష్ అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.