డైరక్షన్ పనిలో అనుపమ పరమేశ్వరన్

Update: 2019-06-10 04:23 GMT

అనుపమ పరమేశ్వరన్. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా..ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ ఈ మళయాళ భామ. ఓ వైపు సినిమాలు చూస్తే ఈ హీరోయిన్ తనకు మక్కువైన డైరక్షన్ పై దృష్టి పెట్టింది. ఎప్పటికైనా మెగాఫోన్ పట్టుకోవాలన్దని ఈ భామ టార్గెట్. ప్రస్తుతం దర్శకత్వంలో మెళకువలు తెలుసుకునే పనిలో ఉంది. సమయం దొరికినప్పుడల్లా దర్శకత్వం శాఖపై దృష్టి పెడుతున్న నటి అనుపమ పరమేశ్వరన్‌ ఇటీవల నటిగా విరామం రావడంతో సహాయ దర్శకురాలిగా మారిపోయింది.

మలయాళంలో నటుడు దుల్కర్‌ సల్మాన్‌ సొంతంగా నిర్మిస్తున్న చిత్రానికి సహాయ దర్శకురాలిగా మారిపోయిందట. అంతే కాదు త్వరలోనే దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. అయితే ఇక ఈ బ్యూటీని నటిగా మరచిపోవాల్సిందేనా? అని చింతించనవసరం లేదు. దర్శకత్వం చేయాలన్నది తన కోరిక అని, అందుకే మెగాఫోన్‌ పట్టాలనుకుంటున్నానని, నటిగానూ కొనసాగుతానని అనుపమ పరమేశ్వరన్‌ స్పష్టం చేసింది.

Similar News