ఒక హీరో...హీరో టైటిల్ తోనే సినిమా చేయటం. గతంలో ఈ టైటిల్ తో పలు భాషల్లో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి తెలుగులో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ‘హీరో’ సినిమాకు శ్రీకారం చుట్టాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో మలయాళ నటి మాళవిక మోహనన్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.
విజయ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాతో కూడా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా కాంత్రికుమార్ దర్శకత్వంలో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు విజయ్.