రాఫెల్ పై సీబీఐ అవసరం లేదు

Update: 2019-05-04 09:41 GMT

ఇదీ కేంద్రం వాదన. సోమవారం నాడు రాఫెల్ కు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రహస్య పత్రాలకు సంబంధించిన అంశంపై ప్రభుత్వ వాదనను వివరిస్తూ కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. డిసెంబర్ 14న ఇచ్చిన సుప్రీం తీర్పు సరైనదని..దీన్ని సమీక్షించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో కొనుగోలు చేయతలపెట్టిన రాఫెల్ విమానాల ధరలతో పోలిస్తే తాము కొనుగోలు చేస్తున్న విమానాల ధర 2.86 శాతం తక్కువగానే ఉందని అఫిడవిట్ లో పొందుపర్చారు. అంతే కాదు ధరల వివరాలను కాగ్ కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు. . పిటీషనర్లు కోర్టు ముందు పెట్టిన పత్రాలు రహస్య పత్రాలకు సంబంధించినవే అని..అయితే అవి ఒప్పంద సమయంలో నిపుణులు ఇఛ్చిన సలహాలు మాత్రమే అని తెలిపారు.

రాఫెల్ ఒప్పందం దేశ రక్షణకు సంబంధించిన అంశం అని..దీంతో రహస్య పత్రాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. రహస్య పత్రాల ఆధారంగా విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు నిర్ణయం సరికాదని కేంద్రం పేర్కొంది. ఇది దేశ భద్రతతోపాటు అంశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. కేంద్రం అఫిడఫిట్ సమర్పించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

 

Similar News