విద్యార్ధుల జీవితాలతో విపక్షాల చెలగాటం

Update: 2019-05-01 13:20 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. విపక్షాలు విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి కెటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో మాట్లాడుతూ కెటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన గందరగోళం తనను కలచివేసిందని..విద్యార్ధులు ఎవరూ ఆందోళనలతో ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.

ఇంటర్ ఫలితాల విషయంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. నాలుగు కోట్ల రూపాయల టెండర్ కు ఎవరైనా పది వేల కోట్ల రూపాయల లంచం ఇస్తారా? అని ప్రశ్నించారు. అవసరం అయితే కాంగ్రెస్ నేతలను ఈ అంశంపై కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఇంటర్ పొరపాట్లకు కారణమైన వారిపై చర్యలు ఉంటాయన్నారు.

Similar News