‘మహర్షి’ టిక్కెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు

Update: 2019-05-08 12:22 GMT

‘మహర్షి’ సినిమా టిక్కెట్ రేట్ల పెంపు వివాదంపై నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు స్పందించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే రేట్లు పెంచామని చెప్పారు. ఇప్పుడున్న రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా మూడు రోజుల ముచ్చటగానే మారిందని..పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలంటే రేట్లు పెంచకతప్పదన్నారు. తెలంగాణలోనే కాదు..ఏపీలోని థియేటర్లలో కూడా రేట్లు పెంచినట్లు ఆయన వివరించారు.

బాహుబలి వంటి భారీ చిత్రం కూడా 50 రోజులు ఆడలేదన్నారు. మహర్షి సినిమాను గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాసయాదవ్ మాత్రం రేట్ల పెంపుపై కోర్టును ఆశ్రయిస్తామని..తమ తొలి ప్రాధాన్యత ప్రేక్షకులకు తక్కువ రేట్లతో వినోదానికే అని తెలిపారు.

 

Similar News