జగన్ తో టచ్ లో కాంగ్రెస్

Update: 2019-05-13 10:32 GMT

రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఫలితాల తేదీ దగ్గర పడుతుండటంతో ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. ఈ సారి ఏపీలో వైసీపీ అత్యధిక సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.అదే సమయంలో అధికార టీడీపీ కంటే వైసీపీనే అత్యధిక ఎంపీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జగన్ తో టచ్ లో ఉందని ప్రకటించారు. జగన్ తోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ తో కూడా మాట్లాడారని తెలిపారు.

చంద్రబాబు ను చూస్తే జాలి వేస్తోందని అన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ల చుట్టూ అవకాశవాది చంద్రబాబు రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ఆ ర్ కాంగ్రెస్ అదినేత జగన్ తమ కాంగ్రెస్ నేత కుమారుడేనని వ్యాఖ్యానించారు. టిటిడి బంగారం తరలింపు వ్యవహారంలో కేంద్ర హోం శాఖ అనుమతి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తాను గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

 

Similar News