‘టైగర్ కెసీఆర్’ పై వర్మ వివరణ

Update: 2019-04-22 14:07 GMT

రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా సంచలనమే. ఆయన టైటిల్ ప్రకటించినప్పటి నుంచి వివాదాలు మొదలవుతాయి. ఇదేమీ ఆయనకు కొత్త కాదు. ఆయన అభిమానులకూ ఇదేమీ వింత అన్పించదు. ఇప్పుడు ‘టైగర్ కెసీఆర్’ సినిమా టైటిల్ ప్రకటించారో లేదో..ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. టైటిల్ తో పాటు ఓ చిన్న పాటతో వీడియోను కూడా వర్మ విడుదల చేశారు.

అందులో వర్మ వ్యాఖ్యలపై విమర్శలు రావటంతో ఆయన వివరణ ఇచ్చారు. తాను తీయబోయే సినిమా ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా ఉండదని, తెలంగాణ ప్రజలను అవమానపరిచిన కొంతమంది ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే ‘టైగర్‌ కేసీఆర్‌’ ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలందర్నీ కేసీఆర్‌ ప్రేమించారని, ఆయన యుద్దం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఆంధ్ర నాయకుల మీదేనని అన్నారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

Similar News