కిరణ్ బేడీకి మద్రాస్ హైకోర్టు షాక్

Update: 2019-04-30 10:37 GMT

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ దూకుడుకు అడ్డుకట్ట పడింది. రోజు వారి పాలనలో కిరణ్ బేడీ జోక్యం చేసుకోవటానికి అవకాశం లేదని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. గత కొంత కాలంగా సీఎం నారాయణస్వామితో ఆమె పలు అంశాల్లో ఘర్షణ వైఖరికి దిగారు. రోజువారీ వ్యవహారాల్లో తలదూర్చటంతోపాటు..కీలక విషయాల్లో ఆమె స్వతంత్రంగా వ్యవహరించటానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్ట్ నెంట్ గవర్నర్ అధికారాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీకి పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై హైకోర్టులోని మధురై బెంచ్ విచారణ జరిపి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక, పరిపాలనా పరమైన అంశాల్లో కిరణ్ బేడీకి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం లేదన్నారు. ఏదైనా కేబినెట్ సలహాతోనే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. తాజా కోర్టు తీర్పుతో కిరణ్ బేడీ కి క్ పెట్టినట్లు అయింది.

 

Similar News