టీడీపీకి అనుకూలంగా నాలుగు పార్టీల ఉమ్మడి ప్రకటన?

Update: 2019-04-08 05:41 GMT

ఎన్నికల ప్రచారం మంగళవారం తో ముగియనుంది. ఇక మిగిలింది అసలు పోరే. అయితే అసలు పోరుకు కొన్ని గంటల ముందు నాలుగు పార్టీలు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా? అంటే ఔననే చెబుతున్నాయి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు. ప్రస్తుతం కలసి నడుస్తున్న ఈ నాలుగు పార్టీలో అదికార టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా కోరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తమ కూటమి గెలుపు అవకాశాలు ఏ మాత్రం లేని చోట అని చెప్పినా.. అంతిమంగా ఆ పార్టీకి లాభం చేయటమే వాటి ఉద్దేశం. దీనికి వారు చూపించే ప్రధాన కారణం వైసీపీ బిజెపితో కలసి సాగుతుందని..అందుకే తాము టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతున్నామని చెప్పే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇదే కనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కన్పిస్తోంది. అయితే ఇలా ప్రకటన చేయటం వల్ల లాభం జరుగుతుందా? లేక నష్టమా అన్న అంశంపై ఆయా పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకుని ఉన్న ఓట్లను, క్యాడర్ ను కోల్పోయే పరిస్థితి ఉందని ఓ వైపు జిల్లాలకు చెందిన సీపీఎం స్థానిక నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ దశలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రకటన వెలువడితే పరిస్థితి మరింత రంజుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానినికి ప్రచారం ముగిసే సమయానికి ఏపీ రాజకీయాల్లో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే. తమ కూటమి బలంగా లేని చోట్ల..జిల్లాల వారీగా మరీ ఎవరికి సపోర్ట్ చేయాలో చెప్పేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

 

 

 

Similar News