చంద్రబాబు ఓ పచ్చి అవకాశవాది

Update: 2019-04-04 13:12 GMT

దేశంలోనే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంత పచ్చి అవకాశవాది ఎక్కడా కన్పించరని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బిజెపి మళ్ళీ ఎక్కువ సీట్లతో విజయం సాధిస్తే ఆయన తిరిగి తమ దగ్గరకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. గురువారం నాడు నరసరావుపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఓటమి పాలు కాగానే బయటకు వెళ్లిపోయారని..మళ్ళీ మోడీ హవాను చూసి బిజెపితో పొత్తు పెట్టుకుని లాభపడ్డారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలసి సాగుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అదికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడని ఆయన విమర్శించారు. చంద్రబాబు మళ్ళీ తమ వద్దకు వచ్చినా ఈ సారి ఆ అవకాశం ఇవ్వబోమని ఆయన అన్నారు.

ప్రజలను మభ్య పెట్టడానికి రకరకాల డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు వాటిని నమ్మబోరని షా వ్యాఖ్యానించారు.ఎపికి ఎంతో సాయం చేసిన కేంద్రంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని ఆయన ద్వజమెత్తారు. కేంద్రంలో తిరిగి అదికారం బిజెపిదేనని అమిత్ షా అన్నారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు తన పాలనలో నారా లోకేష్ ను అభివృద్ధి చేశారు తప్ప..రాష్ట్రాన్ని కాదని విమర్శించారు. కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన విద్యా సంస్థలు అన్నింటిని మంజూరు చేసినా స్థలం ఇవ్వకుండా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రదాని మోడీ, మహాకూటమికి మధ్య సాగుతున్న ఎన్నికలు అని అభివర్ణించారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి సీఎం అయిన వ్యక్తి చంద్రదబాబు అని ధ్వజమెత్తారు.

Similar News