రోడ్డెక్కిన చంద్రబాబు

Update: 2019-04-05 10:53 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐటి దాడులకు నిరసనగా రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమను భయబ్రాంతులకు గురిచేసేందుకు దాడులకు పాల్పడుతున్నాయని..సేవ్ డెమాక్రసీ అంటూ విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రం రోడ్డు మీద బైఠాయించారు. కొద్దిసేపు నిరసన ప్రదర్శనకు దిగారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.గతంలో తాము సేవ్ డెమాక్రసీ అంటూ ఉద్యమించినా ప్రధాని నరేంద్రమోడీ ఏ మాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.ఆ తర్వాత నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలియజేశారు.

మోడీ నుంచి ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీతో కలసి మోడీ ఏపీలో అరాచకాలు సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని నాశనం చేయాలని మోడీ కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తాము ఎంత వరకైనా వెళతామన్నారు.

 

 

Similar News