గాజువాక..భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

Update: 2019-03-19 07:44 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి మోడల్ నే ఎంచుకున్నారు. ఒక్క చోట పోటీచేసి పరాజయం పాలైతే ఇబ్బంది అని రెండు చోట్ల పోటీకి నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఏపీ మొత్తంలో ప్రస్తుతం రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి, విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి బరిలోకి దిగనున్నారు. రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ ను జనరల్ బాడీ కోరిందని జనసేన ఒక ప్రకటన లో తెలిపింది. పవన్ ఒక్క చోట నుంచి పోటీచేస్తానంటే జనరల్ బాడీ అంగీకరించదా?. తన రాజకీయ అవసరాలకు ‘జనరల్ బాడీ’ అనే అంశాన్ని వాడుకున్నారనే విషయం స్పష్టం అవుతూనే ఉంది.

పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే పార్టీకి పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవడానికి జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపించింది.అనంతపురం,తిరుపతి,రాజానగరం,పిఠాపురం,భీమవరం,గాజువాక,పెందుర్తి,ఇచ్చాపురం స్థానాలు అగ్రస్థానంలో నిలిచాయి .ఈ ఎనిమిది స్థానాలపై అంతర్గత సర్వే జరిపించిన జనరల్ బాడీ లోని మేధావులు,విద్యావేత్తలు,ఇతర రంగాల నిపుణులు భీమవరం,గాజువాక స్థానాల నుంచి పోటీ చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ ను కోరారు. దీనికి ఆమోదం తెలిపిన పవన్ కళ్యాణ్ గారు భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీచేయాలని నిర్ణయించుకన్నట్లు తెలిపారు.

 

 

Similar News