మసూద్ మా దగ్గరే ఉన్నాడు

Update: 2019-03-01 06:46 GMT

ఈ విషయాన్ని సాక్ష్యాత్తూ పాకిస్థాన్ కు చెందిన మంత్రే నిర్ధారించారు. భారత్-పాక్ ల మధ్య ఉద్రికత్తలు నెలకొన్న ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ ఓ విదేశీ మీడియా సంస్థతో మాట్లాడుతూ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ పాక్ లోనే ఉన్నాడని తేల్చిచెప్పారు. అయితే అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని..ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితిలో లేదని తెలిపారు. భారత్ తమకు సరైన ఆధారాలు చూపిస్తే చర్యలకు తాము సిద్ధంగా ఉన్నామని..అదే సమయంలో చర్చలకు కూడా సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

మసూద్ ను అరెస్టు చేయాలంటే భారత్ దీనికి తగ్గట్లు బలమైన ఆధారాలు చూపాలని...అవి తమ కోర్టులు ఆమోదించేలా ఉండాలని వ్యాఖ్యానించారు. జైషే మహమ్మద్ ఉగ్రదాడిలో భారత్ కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాడ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు తామే కారణం అని స్వయంగా జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. భారత్ లో పలు ఉగ్రదాడులకు కారణమైన మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ గత కొంత కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూడా మద్దతు ఇఛ్చాయి.

Similar News