కెసీఆర్ పై వివేక్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-03-23 11:17 GMT

తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారు పదవికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ గడ్డం వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బానిసత్వం నుంచి స్వేచ్చ వచ్చినట్లు ఉందని’ వ్యాఖ్యానించారు. పక్కన కూర్చో పెట్టుకుని తనకు టిక్కెట్ ఇవ్వకుండా సీఎం కెసీఆర్ తన గొంతు కోశారని విమర్శించారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం పోరాడుతానని వ్యాఖ్యానించారు. కార్యకర్తల సూచనలు..సలహాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ఉంటుందని అన్నారు. కెసీఆర్ తనను ఇలా మోసం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు.

తాను టిక్కెట్ ఎప్పుడూ అడగలేదని పెద్దపల్లి టిక్కెట్ ఇస్తామని అనేక సార్లు మభ్యపెట్టారని ఆరోపించారు. అయితే వివేక్ పై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ అభ్యర్ధులను ఓడించేందుకు కృషి చేశారని..ప్రత్యర్ధులకు ఆర్ధిక సాయం కూడా చేశారని ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. వినోద్ కు టిక్కెట్ ఇవ్వకుండా కెసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నారు.

 

Similar News