జనసేనలో చేరిన సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ

Update: 2019-03-17 07:05 GMT

రకరకాల ఊహగానాల అనంతరం సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ జనసేనలో ల్యాండ్ అయ్యారు. ముందు సొంత పార్టీ అని ప్రచారం...ఆ తర్వాత బిజెపి, టీడీపీ నుంచి భీమిలో అసెంబ్లీకి పోటీ అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ సడన్ గా శనివారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం...ఆదివారం ఉదయం పార్టీలో చేరిపోయారు. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారాలకు బ్రేక్ పడినట్లు అయింది. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ఆయన తనకు వ్యవసాయ శాఖ మంత్రి కావాలని ఉందని ప్రకటించటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అసలు ఏమీ లేకుండానే ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రి అని ప్రకటించారు. దీనిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

లక్ష్మీనారాయణతోపాటు ...కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ కూడా జనసేనలో చేరారు. వీరిద్దరికి పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజా సేవలో పనిచేస్తున్న జనసేనలో చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జనసైనికుల్లో తాను కూడా ఒకరిగా మారిపోయానని వ్యాఖ్యానించారు. ముందుకెళదాం..దేశాన్ని మారుద్దాం..జనసేన సత్తా ఏంటో చూపిద్దాం అంటూ నినదించారు. లక్ష్మీనారాయణ తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు పవన్ కు కృతజ్ణతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కు మంచి జ్ణానం, ధైర్యం, ప్రజాదరణ ఉన్నాయన్నారు.

 

 

 

 

Similar News