వాళ్లిద్దరిదీ హిట్ కాంబినేషనే. వాళ్ళే అల్లు అర్జున్, క్యాథరిన్ థ్రెస్సా. సరైనోడు సినిమాలో అయితే వీళ్ళిద్దరూ కలసి పెద్ద సందడే చేశారు. ఇద్దరమ్మాయి..రుద్రమదేవి సినిమాల్లో క్యాథరిన్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఇప్పుడు అల్లు అర్జున్, క్యాథరిన్ మరోసారి జోడీ కట్టడానికి రెడీ అయిపోతున్నారు. అదీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పలు హిట్లు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా పూజా హెగ్డెను ఎంపిక చేశారు. మరో భామగా క్యాథరిన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్, రాధకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.