కడప ఎంపీ బరిలో ఆదినారాయణరెడ్డి

Update: 2019-02-08 14:21 GMT

తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న జమ్మలమడుగు వివాదం ఓ కొలిక్కి వచ్చింది. శుక్రవారం నాడు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దగ్గర జరిగిన సమావేశంలో ‘సీట్ల’ పంపకం పూర్తి చేశారు. ఈ రాజీ ఫార్ములా ప్రకారం మంత్రి ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ బరిలో నిలవనున్నారు. దీని కోసం ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలవనున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ఈ లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు అందజేశారు. దీంతో గత కొంత కాలంగా ఈ సీట్లపై సాగుతున్న పీఠముడి విడిపోయినట్లు అయింది. గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పలు జిల్లాల్లో వివాదస్పదంగా ఉన్న సీట్ల అంశంపై పార్టీ నాయకులతో మాట్లాడుతూ సమస్యలను ‘సెటిల్’ చేస్తున్నారు. అందులో భాగంగానే కడప వివాదం ముగిసిందని చెబుతున్నారు.

 

Similar News