మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు

Update: 2019-02-23 09:53 GMT

రాబోయే రోజుల్లో ఇద్దరు మహిళలకు తన మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. శాసనసభలోనే ఈ విషయం తెలిపారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సారైనా కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన కెసీఆర్ మహిళల ఓట్లతోనే తాము అత్యధిక మెజారిటీతో గెలిచామని..వారికి ఖచ్చితంగా చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

గత ఎన్నికల సమయంలో కూడా కెసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేని విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొత్తగా కేబినెట్ లోకి పది మంది మంత్రులను తీసుకున్నా ఒక్క మహిళకు కూడా ఈ సారి చోటు కల్పించలేదు. అయితే కెసీఆర్ తాజా ప్రకటనలో టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల్లో ఆనందం నెలకొంది.

 

Similar News