మంత్రి పదవి ఇవ్వకపోయినా అసంతృప్తి లేదు

Update: 2019-02-19 09:45 GMT

తెలంగాణ నూతన మంత్రుల ప్రమాణస్వీకారానికి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చారు. మంత్రివర్గ జాబితాలో ఆయన పేరు లేకపోవటం టీఆర్ఎస్ వర్గాల్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. విస్తరణ తర్వాత బయటకు వెళుతూ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న బాధ తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవి రాలేదని తాను అసంతృప్తితో ఉన్నట్లు, పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.

కొత్తగా ఎన్నికైన తెలంగాణ మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధే ద్యేయంగా కొత్త మంత్రులు కేసీఆర్‌ దిశా నిర్దేశంలో కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేసీఆర్‌ ఏ బాధ్యత అప్పగించినా సామాన్య కార్యకర్తగా, క్రమశిక్షణ గల నాయకుడిగా పనిచేస్తానని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో తనపైన వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని హరీష్‌ రావు విజ్ఞప్తి చేశారు. తనకు ఎలాంటి గ్రూప్ లు..సైన్యాలు లేవని అన్నారు.

 

 

Similar News