సీఎంను అసెంబ్లీ రౌడీ అన్న బిజెపి

Update: 2019-02-02 04:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. సీఎంను ఏకంగా అసెంబ్లీ రౌడీ అని విమర్శించింది. శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు చూస్తే ఆయన పిచ్చి పీక్స్ కు వెళ్లిందని బిజెపి ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీ వీఎల్ నరసింహరావు విమర్శించారు.

మహా ఫ్రస్టేషన్‌లో ఉన్న సీఎం ‘అసెంబ్లీ రౌడీ’లాగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. సీఎం తీరుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజుతో చంద్రబాబు ప్రవర్తించిన తీరు ఏ మాత్రం సరికాదన్నారు.

Similar News