జగన్ ను బీసీలు నమ్మరు

Update: 2019-02-18 04:53 GMT

వైసీపీ నిర్వహించిన బీసీ గర్జనపై తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. టీడీపీ నిర్వహించిన బీసీల సభ చూసి బెంబేలెత్తిన జగన్ ఫ్రస్టేషన్ తో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ మాటలను బీసీలు ఎవరూ నమ్మరని..బీసీలంతా టీడీపీవైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. సోమవారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ నేతలు నిరాశా నిస్పృహలతోనే వైసిపి ఏలూరు బీసి సభ పెట్టారు. జనాభాలో 50% ఉన్న బిసిల మద్దతు టిడిపికే.

దానిని జీర్ణించుకోలేకే వైసిపి విమర్శలు. జగన్ మొసలి కన్నీరు బీసిలు నమ్మరు. జగన్ తండ్రి బీసిలను అణిచివేశారు. బీసి ఫెడరేషన్లకు కుర్చీలు,బెంచీలకు కూడా నిధులివ్వలేదు. బీసి సబ్ ప్లాన్ కు టిడిపి ప్రభుత్వమే చట్టబద్దత ఇచ్చింది. మళ్లీ చట్టబద్దత చేస్తాననడం జగన్ అవివేకం. చేసిన చట్టాన్నే మళ్లీ చట్టంగా చేస్తానంటాడు. బడ్జెట్ గురించి, నిధుల విడుదల గురించి జగన్ కు తెలియదు. ప్రాధమిక ఆర్ధిక నిబంధనల పరిజ్ఞానం జగన్ కు లేదు. అవినీతి సంపద పెంచుకోవడమే జగన్ కు తెలుసు. సమాజ సంపద పెంచడం జగన్ కు చేతకాదు.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

Similar News