ఏపీ ఉద్యోగులకు 20 శాతం ఐఆర్

Update: 2019-02-08 14:00 GMT

ఏపీలో ఎన్నికల వరాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించేందుకు భారీ వరమే ప్రకటించింది చంద్రబాబు సర్కారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగానే కీలక నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు సర్కారు చకచకా ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే పెండింగ్ అంశాలు అన్నీ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఓ వైపు పాత ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ..మరో వైపు కొత్త వరాలు ఇస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు.

శుక్రవారం నాడు అమరావవతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు 20శాతం మధ్యంత భృతి (ఐఆర్‌) ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం వల్ల సర్కారుపై ఏటా ఆరు వేల కోట్ల రూపాయలపైన భారం పడుతుందని తెలిపారు. తొలుత ఉద్యోగులు మాత్రం 40 నుంచి 45 శాతం మేర ఐఆర్ ఇవ్వాలని కోరారు. సర్కారు 20 శాతానికి ఓకే చెప్పింది.

 

Similar News