ఈవీఎంల నుంచి వెనక్కిపోలేం

Update: 2019-01-24 05:42 GMT

కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఈవీఎంలపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. మళ్లీ బ్యాలెట్ పత్రాల పాత యుగానికి వెళ్లలేమని సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ లు కూడా వాడుతున్నామని..విమర్శలను స్వాగతిస్తామని అన్నారు. అదే సమయంలో పార్టీల సలహాలు..సూచనలు కూడా ఈ అంశంపై తీసుకుంటామని వెల్లడించారు. దేశంలోని 22 పార్టీల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఈవీఎంలు వద్దు..బ్యాలెట్ తోనే ఎన్నికలు జరపాలని నిర్ణయించిన సమయంలో సీఈసీ అనిల్ అరోరా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తాజాగా మరోసారి ఈవీఎంల హ్యాకింగ్ అంశం దేశంలో దుమారం రేపుతోంది. విచిత్రంగా ఈ అంశంపై పార్టీలు తమ రాజకీయాన్ని చూపెడుతున్నాయి. బిజెపి మిత్రపక్షాలైన ఈవీఎంలు సూపర్ అంటుంటే..కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం విశేషం. మరి సీఈసీ వ్యాఖ్యలపై పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే. బ్యాలెట్ లు ఉపయోగించటం వల్ల ఎన్నో కొత్త సమస్యలు వస్తాయని..భద్రతాపరమైన సమస్యలపై కూడా తమకు అవగాహన ఉందన్నారు. కౌంటింగ్ కూడా చాలా ఆలశ్యం అవుతుందని తెలిపారు.

 

Similar News