తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం

Update: 2019-01-17 06:03 GMT

సీనియర్ నేత, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేరే తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్ పదవికి ఖరారు అయింది. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. స్పీకర్ బరిలో నిలవరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవటంతో పోచారం ఎన్నిక కేవలం లాంఛనమే కానుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ ఇఫ్పటికే అన్ని పార్టీ నేతలతో మాట్లాడి స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వంలో కూడా పోచారం మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

గురువారం ఉదయమే అధికారికంగా పోచారం శ్రీనివాసరెడ్డి పేరును స్పీకర్ పదవికి ఖరారు చేసినట్లు వెల్లడైంది. అంతకు అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం కెసీఆర్ తో పోచారం భేటీ అయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి పోచారం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం ఎన్నిక జరగనుంది.

 

Similar News