ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్!

Update: 2019-01-15 16:21 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ సీఎం కెసీఆర్ నిర్ణయించారు. అయితే జగన్ తో చర్చలు జరిపే బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తోపాటు పార్టీ నేతలు వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డికి కెసీఆర్ అప్పగించారు. గత కొంత కాలంగా కెసీఆర్ దేశంలోని ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇది బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని కెసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే జెడీఎస్ నేతలు దేవేగౌడ, కుమారస్వామితో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లతో కెసీఆర్ చర్చలు జరిపారు.

ఇప్పుడు జగన్ తో చర్చలు జరిపే బాధ్యతను పార్టీ నేతలకు అప్పగించారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో కెసీఆర్, జగన్ కలసి తమను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి ఎన్నికలకు ముందే జగన్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరటానికి ఆసక్తి చూపుతారా?. లేక ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూస్తారా? అన్నది బుధవారం నాటి చర్చల తర్వాత కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.

 

Similar News