అలోక్ వర్మ రాజీనామా

Update: 2019-01-11 10:07 GMT

సీబీఐ మాజీ డైరక్టర్ అలోక్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ డైరక్టర్ గా తప్పిస్తూ..ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వర్మ తప్పుపడుతున్నారు. అందుకే ఆయన ఏకంగా తన సర్వీసుకే రాజీనామా చేశారు. సీబీఐ డైరక్టర్ ను మధ్యలో తప్పించటం అనేది చాలా అరుదైన సంఘటన. ఓ వైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో బాధ్యతలు చేపట్టిన వర్మను తప్పించాలని ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రదాని మోడీ, సుప్రీంకోర్టు జడ్జి వర్మపై వేటుకు ఆమోదం తెలపగా..లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాత్రం ఆయన వాదన విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొత్త బాధ్యతలు అగ్నిమాపక శాఖ డీజీ బాధ్యతలు చేపట్టడానికి వర్మ నిరాకరించారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారం కూడా రేపుతోంది. ప్రధాని మోడీ భయంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Similar News