‘పడరేమో అని టెన్షన్ పడకండి.పడేసే బాధ్యత నాది’. కారులో వెళుతున్న హీరోయిన్ సాయిపల్లవితో హీరో శర్వానంద్ చెప్పే డైలాగ్. ఇది పడి పడి లేచే మనసు సినిమాలోది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కోల్కత బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అయ్యింది. ట్రైలర్ చూస్తే సినిమా హను రాఘవపూడి మార్క్ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన్నట్టుగా కన్పిస్తోంది.
https://www.youtube.com/watch?time_continue=111&v=IkLz6dhHmOQ