అదరగొడుతున్న ‘ఎన్టీఆర్ లుక్స్’

Update: 2018-12-20 09:29 GMT

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా సందడి పెరిగింది. చిత్ర విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర యూనిట్ రోజుకో పోస్టర్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అందులో భాగంగా గురువారం నాడు ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర పోషించిన విద్యాబాలన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో విద్యాబాలన్ హర్మోనియం వాయిస్తుంటే...ఎన్టీఆర్ బుగ్గ కింద చేయిపెట్టుకుని ఆసక్తిగా ఆలకిస్తుంటాడు. ఎన్టీఆర్‌ పోషించిన రావణాసురుడి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు.

డిసెంబర్ 21న అభిమానుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్‌ యన్‌.టి.ఆర్‌. బాలయ్య టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా తొలి భాగం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Similar News