విజయవాడలో ‘ఫైవ్ స్టార్’ హోటల్

Update: 2018-12-09 15:15 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విజయవాడ ప్రాంతానికి ‘ఫైవ్ స్టార్’ కళ వస్తోంది. రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున ఫైవ్ స్టార్స్ హోటల్స్ ఏర్పాటుకు సర్కారు పలు రాయితీలు ఇస్తోంది. తొలుత సుమారు వంద కోట్ల రూపాయలతో నిర్మించిన నోవాటెల్ హోటల్ ప్రారంభం అయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ హోటల్ ను ప్రారంభించారు.

విజయవాడ భారతీనగర్ లో నిర్మించిన ఈ ఫైవ్ స్టార్ హోటల్ లో 227 రూమ్ లు, 4 రెస్టారెంట్లు, 10 వేల చదరపు అడుగుల వైశాలత్యంతో కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయని వరుణ్ గ్రూప్ ఛైర్మన్ ప్రభు కిషోర్ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో విజయవాడలో ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

Similar News