‘భైరవ గీత’ మూవీ రివ్యూ

Update: 2018-12-14 11:15 GMT

రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే ఒకప్పుడు యమా క్రేజ్. ఇప్పుడు వర్మ సినిమాలు అంటే చాలా మంది అటువైపు కూడా చూడటం లేదు. సాహసం ఉన్న వాళ్లు ఎవరైనా సినిమా చూసి చెపితే..లేకపోతే రివ్యూల్లో ఏమైనా కాస్త సరుకు ఉంది అంటే అప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. అదీ ఇప్పుడు వర్మ పరిస్థితి. అలాంటి వర్మ ఇప్పుడు నిర్మాతగా మారి..తన శిష్యుడితోనే దర్శకత్వం చేయించి ఓ సినిమా తీసేశారు. అదే ‘భైరవ గీత’. అంతే పెద్ద మార్పేమీ లేదు. అదే ఫ్యాక్షన్ కథ. అదే శృతి మించిన రొమాన్స్. అక్కడక్కడ ఏదో కాస్త బాగున్నాయన్న సీన్లు. అదీ పరిస్థితి. చాలా రొటీన్ కథతోనే ప్రయత్నం చేసిన దర్శకుడు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడనే చెప్పొచ్చు. ఓ ఫ్యాక్షనిస్టు దగ్గర పనిచేస్తున్న హీరో. ఆ ఫ్యాక్షనిస్టు కూతురిని ప్రేమించటం.

సహజంగానే అందుకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవటం అనే పరమ రొటీన్ స్టోరీ లైనే ఈ సినిమాలోనూ కన్పిస్తుంది. నటనపరంగా చూస్తే సినిమాలో నటుల ఎంపిక మాత్రం పర్వాలేదనే అన్పిస్తుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ధనుంజయ, భైరవ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌ లో ధనుంజయ నటన ఆకట్టుకుంటుంది. గీత పాత్రలో కనిపించిన ఇర్రా మోర్‌ నటన కూడా ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా పరిణతి కలిగిన నటిలా కనిపించింది. పర్ఫామెన్స్‌ తో పాటు గ్లామర్‌ షోతో అదరగొట్టే ప్రయత్నం చేసింది. సినిమాలో లవ్‌ స్టోరి ఏమాత్రం కన్వింన్సింగ్‌గా లేదు.

రేటింగ్. 1.5/5

 

Similar News