వాడెవడో 12 శాతం అంటడు...తమషా చేస్తున్నవా

Update: 2018-11-30 05:26 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ ఎన్నికల సభలో ఓ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగజ్ నగర్ ఎన్నికల సభలో పాల్గొన్న కెసీఆర్ ను ఓ మైనారిటీ యువకుడు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘మాట్లాడతా అరవకుండా కూర్చో. 12 శాతం గురించే చెబుతా.వాడెవడో 12 శాతం అంటాడు. వాడెవడో. చెబుతా కదరాభయ్. తొందర ఎందుకు పడతవ్. అరవకుండా కూర్చో. చెబుతున్నా కూర్చో (ఆగ్రహంతో). నీ బాబుకు కూడా చెబుతా? ఏంటి సంగతి?.

తమషా చేస్తున్నావా?.ఏమి వద్దయ్యా బాబూ. ఏమి అనకండి.ఉంటరు కదా? అడొకడు..అడొకడు ఉంటరు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ముస్లిం రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపిందని..కేంద్రం ఆమోదించలేదని కెసీఆర్ తెలిపారు. అంతే కాదు..రిజర్వేషన్ల పరమితిపై సుప్రీంకోర్టుది కూడా తప్పంటూ వ్యాఖ్యానించారు. మరో సభలో కెసీఆర్ సింగరేణి ఉద్యోగుల నుంచి ఇదే పరిస్థితి ఎదురైంది. వాళ్లను కూడా ప్లకార్డులు దింపాల్సిందిగా ఆదేశించారు.

Similar News