హెబ్బా పటేల్. తెలుగులో తొలి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్న హీరోయిన్. కారణాలు ఏంటో కానీ..గత కొంత కాలంగా ఆమె కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడు ‘24 కిసెస్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చిందనే చెప్పాలి. హీరో అరుణ్ షార్ట్ ఫిల్మ్ లు తీస్తూ..క్లాస్ లు చెబుతూ కాలం వెళ్ళదీస్తుంటాడు. అదే కాలేజీలో హీరోయిన్ హెబ్బాపటేల్ కూడా చదువుతూ..షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటుంది. అక్కడే వీరిద్దరి పరిచయం..ప్రేమగా మారుతుంది. కానీ అది ప్రేమ అని నిర్ధారించుకోవటానికి అరుణ్ కు చాలా సమయం పడుతుంది. ఎందుకంటే హీరో అంతకు ముందు ఇదే తరహాలో కొంత మంది అమ్మాయిలతో శారీరక సంబంధాలు కొనసాగిస్తాడు. అరుణ్ జీవిత లక్ష్యం దేశంలో సరైన పోషకాహారం లేక చనిపోతున్న పిల్లలపై ఓ సినిమా తీయాలని. కానీ దీనికి ఎవరూ నిధులు ఇవ్వటానికి ముందుకు రారు. చివరకు క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని కూడా ఎంచుకున్నా సక్సెస్ కాదు. మధ్యలో లవ్ ట్రాక్ లో డిస్ట్రబెన్స్.
ఎట్టకేలకు తమ మధ్య ఉన్నది ప్రేమ అని గ్రహించి హీరోయిన్ ఇంటికి వెళతాడు మాట్లాడానికి. అయితే హీరోయిన్ తండ్రి నరేస్ వేసే ప్రశ్నల్లో దేనికీ సరైన సమాధానం ఉండదు అరుణ్ దగ్గర. తాము పెళ్లి చేసుకోం..పిల్లలు వద్దు కానీ కలసి ఉంటాం అని చెప్పి వారిని షాక్ కు గురిచేస్తాడు అరుణ్. సినిమా అంతా అరుణ్ తన స్టోరీ అంతా సైక్రియాటిస్ట్ గా నటించిన రావు రమేష్ కూడా చెబుతుంటాడు. సినిమా అంతా అలా సాగుతూనే ఉంటుంది. ఒక దానికి ఒకటి పొంతన లేకుండా సినిమా ముగిసిపోతుంది. ‘ఏ’ ట్యాగ్ తో వచ్చిన 24 కిసెస్ లో కొన్ని ముద్దు సీన్లు తప్ప...యూత్ ను ఆకట్టుకునే అంశాలు కూడా ఏమీ లేవు. కథలో దమ్ము లేదు కానీ హీరో వరుణ్ మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు. దర్శకుడు కుమార్ కృష్ణంశెట్టి సినిమా సరైన ట్రాక్ లో నడిపించటంలో విఫలమయ్యారు.
రేటింగ్. 1.5/5