రామ్ హీరోగా నటిస్తున్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా సెన్సార్ పూర్తయింది. అంతే కాదు.క్లీన్ యూ సర్టిఫికెట్ దక్కించుకుంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ బృందం కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా కితాబు ఇచ్చినట్లు టాక్. రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీతలు ఈ సినిమాలో హీరో..హీరోయిన్లు. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత రామ్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా చేస్తున్న సినిమా ఇది. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకువస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.