అమలాపాల్ కు కష్టాలు!

Update: 2018-10-24 14:09 GMT

హీరోయిన్ అమలాపాల్ కు కొత్త కష్టాలు. ఆమెను ఫోన్ చేసి మరీ తిట్టేస్తున్నారట. ఆ తమిళ దర్శకుడు..ఆయన భార్య. ఈ తిట్లతో అమలాపాల్ షాక్ కు గురవుతోంది.. అసలు ఏంటీ ఈ సంగతి అంటారా?.ఇప్పుడు ఎక్కడ చూసినా ‘మీ టూ’ ఉద్యమమే కదా?. చాలా మంది పాత విషయాలను ఇప్పుడు ధైర్యంగా బహిర్గతం చేస్తున్నారు. ఇవి పెద్ద దుమారమే రేపుతున్నాయి. కొంత మంది మాత్రం అప్పుడు మౌనంగా ఉండి..ఇప్పుడు చెప్పటం ఏంటి అంటూ ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా అమలాపాల్ తమిళ దర్శకుడు సుసి గణేషన్, ఆయన భార్య మంజరి తనకు ఫోన్ చేసి దారుణంగా తిట్టారని అమలాపాల్ చెబుతోంది. గతంలో దర్శకుడు సుసి గణేశన్ తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించారని అమలా ఆరోపిస్తున్నారు. తాజాగా దర్శకురాలు లీనా ఆయనపై ఆరోపణలు చేయటంతో ఆమెకు మద్దతుగా నిలిచిన అమలాపాల్..గతంలో తనకు ఆయన నుంచి ఎదురైన అనుభవాలను వెల్లడించారు.

లీనాకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తిరుటుపాయలే 2 సినిమాలో తాను హీరోయిన్ గా చేసిన సమయంలో దర్శకుడు ద్వందార్ధాలున్న మాటలు మాట్లాడటంతోపాటు..అవసరం లేకపోయినా అవకాశాలు ఇవ్వాలని చూసేవాడని పేర్కొన్నారు. అతని ప్రవర్తన కారణంగా చిత్రీకరణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో తమ భార్య, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారని, ఇతర మహిళల పట్ల మాత్రం అభ్యంతరకరంగా వ్యవహరిస్తారని అమలాపాల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే సుశి, అతని భార్య నుంచి ఫోన్లో భయంకరమైన తిట్లను వినాల్సివ వచ్చందని..అయినా తాను ఇలాంటి వాటికి బెదిరిపోనని పేర్కొన్నారు.

 

 

Similar News