పెళ్లి అంటే సందడే..సందడి. అందులో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు వేగేశ్నసతీష్ తెరకెక్కిస్తున్న సినిమా అంటే సహజంగా అంచనాలు భారీగానే ఉంటాయి. శతమానం భవతి వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందించిన డైరక్టర్ ఆయనే. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి శ్రీనివాస కళ్యాణం సినిమా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరకు రావటంతో సరదా సన్నివేశాలతో చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. దసరా..దీపావళి పండగలు అంటే ప్రతి ఏటా వస్తాయి. కానీ జీవితంలో పెళ్లి అనే పండగ ఒక్కసారి మాత్రమే వస్తుంది అని పెళ్లి ప్రాముఖ్యతను చెప్పేశారు.
ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితిన్..రాశీ ఖన్నా లు ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెళ్లంటే.. పెద్ద పండుగ అని జయసుధ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకోగా.. పెళ్లి వేడుకను అద్భుతంగా చూపెట్టారు . నితిన్, రాశిఖన్నా కూల్ లుక్స్‌లో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న ప్రకాష్ రాజ్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్‌ల నటన ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది.
https://www.youtube.com/watch?v=FUK_nrDQzX8