అభిమాన నటుడిని కలసిన సితార

Update: 2018-08-07 05:47 GMT

‘సితార’. మహేష్ బాబు ఫ్యాన్స్ తోపాటు..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారందరకీ బాగా తెలిసిన పేరు. ఎందుకంటే మహేష్ బాబు కుమార్తె అయిన సితార అంత చురుగ్గా ఉంటారు. పాటలు పాడతారు..హీరోయిన్లతో కలసి సందడి చేస్తుంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు తనయ అభిమాన నటుడు ఎవరో తెలుసా?. అందరినీ నవ్వించే వెన్నెల కిషోర్ అట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబే తెలిపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్ బాబు 25 వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు. అంతే సెట్స్ కు వచ్చిన సితార వెన్నెల కిషోర్ ను కలసి ఓ ఫోటో కూడా దిగింది. ఈ ఫోటోలను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మహేష్ బాబు 25వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టు 9న విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ ‘రిషి’ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది సినిమా టైటిలా? లేక అందులో మహేష్ బాబు పేరా అన్నది తేలాల్సి ఉంది.

 

 

 

Similar News