దేవదాసు మళ్లీ వస్తున్నాడు. పాత దేవదాసు సినిమా అక్కినేని నాగేశ్వరరావు చేస్తే..కొత్త దేవదాసు అక్కినేని నాగార్జున చేస్తున్నారు. ఈ సినిమాలో నాని కూడా ఉన్నారు. ప్రేక్షకులకు చీర్స్ చెబుతూ సినిమా టీజర్ విడుదల చేశారు. అంతే కాదు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ఖచ్చితంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 50 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్లో కేవలం నాగార్జున, నాని మాత్రమే మందుకొడుతూ దర్శమివ్వడం విశేషం. నాగార్జున అలా గ్లాస్ లో మందు పోస్తాడో లేదో నాని ఖాళీ చేసేస్తాడు. మందులోకి సోడానా..ఐస్ కావాలా అని అడిగే లోపే నాని అవి ఖాళీ చేస్తాడు. ఇది చూసిన నాగార్జున దాసూ...ఏంది సంగతి అంటూ ప్రశ్నిస్తాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు.
https://www.youtube.com/watch?v=xt5nRJ8E2H4