పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణకు డిమాండ్

Update: 2018-08-11 14:19 GMT

ఏపీలోని పీడీ అకౌంట్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా బిజెపి, టీడీపీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. బిజెపి ఎంపీ జీ వీ ఎల్ నరసింహరావు పీడీ అకౌంట్లలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపిస్తుంటే..అసలు జీవీఎల్ కు పీడీ అకౌంట్ల గురించి తెలుసా? అంటూ తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తుంది అధికార టీడీపీ. ఇప్పడు తాజాగా జీవీఎల్ పీడీ అకౌంట్ల స్కామ్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ సరసింహన్ కు లేఖ రాశారు. పీ డీ అకౌంట్ల ఖాతాల నుంచి ఉపసంహరణలో అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక తేల్చిన విషయాన్ని జీ వీ ఎల్ అందులో ప్రస్తావించారు.

పీ డీ అకౌంట్ల వ్యవహారంపై రాజకీయ వివరణలతోపాటు చివరకు సర్కారు అధికారులతో కూడా ఈ అంశంపై వివరణ ఇప్పించింది. అయినా బిజెపి నేతలు మాత్రం ఈ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. మరి జీవీఎల్ లేఖపై గవర్నర్ స్పందిస్తారా?. లేక పనికి ఆహార పథకంలోని అక్రమాలకు సంబంధించి ఆధారాలుతో సహా వివరాలు ఇచ్చినా గవర్నర్ చర్యలు తీసుకోవటం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించిన పరిస్థితిలాగే జీవీఎల్ కు ఎదురవుతుందా? వేచిచూడాల్సిందే.

Similar News