అమెరికా సినీ సెక్స్ రాకెట్ డైరీలో ‘హ్యాపీనెస్ ఇండెక్స్’

Update: 2018-06-16 09:28 GMT

సంచలన విషయాలు. అమెరికాలో వెలుగుచూసిన సినీ నటీమణుల సెక్స్ రాకెట్ విషయంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు ప్రతిదీ రికార్డు చేశారు. అందులో ‘హ్యాపీనెస్ ఇండెక్స్’ కూడా ఉందట. తమ పని పూర్తి అయిన తర్వాత ఆయా కస్టమర్లతో ఫోన్ లో మాట్లాడటం లేదా? మెసేజ్ ల రూపంలో సమాచారం కూడా తీసుకున్నారు. అందులో ‘సంతృప్తి స్థాయి’ కూడా ఉండటం విశేషం. కొంత మంది తమ దగ్గరకు వచ్చిన హీరోయిన్లు..ఇతర నటులు చేసిన పనులకు సంబంధించిన వివరాలు...ఏమైనా ఇబ్బంది పెడితే ఆ విశేషాలు కూడా ఈ నిర్వాహకుల జంటకు తెలపగా...వారు మొత్తం రికార్డు చేసి పెట్టారు. ప్రస్తుతం అమెరికా పోలీసులకు ఇవే ప్రధాన ఆయుధాలుగా మారాయి. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులోని వివరాలు చూస్తే మొత్తం తతంగం అంతా వెలుగులోకి వచ్చింది.

కొంత మంది ముందు చెప్పిన మొత్తాలు చెల్లించకపోవటం వంటి సంఘటనలు ఉండగా...విటుల దగ్గరకు వెళ్లిన హీరోయిన్లు చెప్పిన సమయం కంటే ముందే బయటకు చెక్కేయటం వంటివి మరికొన్నిఇందులో ఉన్నాయి. ఈ విషయాలను కూడా వారు తమ దగ్గర డైరీలో పెట్టారు. అయితే ఎటువైపు నుంచి తమ పేర్లు బయటకు వస్తాయో అన్న భయంతో చాలా మంది హీరోయిన్లు హడలిపోతున్నారు. ఒక సారి ఓ విషయం వెలుగు చూసింది అంటే చాలు...ఈ తరహా సంఘటనలకు సంబంధించిన పాత విషయాలు కూడా ఒక్కసారే వెలుగులోకి వస్తాయి. ఈ విషయం పరిశ్రమలోని చాలా మందిని కలవర పెడుతోంది. అయితే ఈ సెక్స్ స్కాండల్ దేశంలో జరిగింది కాపోవటంతో స్థానిక మీడియా ఒకింత సంయమనం పాటిస్తోంది. అదే ఇక్కడ ఏదైనా సమాచారం వచ్చి ఉంటే ఆ కథ వేరేగా ఉండి ఉండేది.

 

 

Similar News