ఇరుముడి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ తో హీరో రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన కెరీర్ లోనే ఈ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా దగ్గర దగ్గర 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు రవి తేజ సినిమాలు ఏవీ కూడా 200 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేయలేదు. అలాంటిది ఇరుముడి ఏకంగా 250 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇంతటి ఘన విజయం తర్వాత వచ్చే సినిమాపై కూడా సహజంగానే అంచనాలు మరింత పెరుగుతాయి. ఈ తరుణంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ తో కలిసి రవి తేజ కొత్త సినిమా చేయనున్నాడు. చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు కథ అందించింది కూడా వివేక్ ఆత్రేయనే. ఈ మూవీకి తులాభారం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో రవి తేజ కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించనుంది.