‘పవన్ కళ్యాణ్’పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2018-02-13 11:17 GMT

తెలంగాణ బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి గతానికి భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు అసలు యాక్టింగే సరిగా రాదని, రాజకీయ నాయకుడిగా పనికిరారని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ఆయన(పవన్‌ కల్యాణ్‌) హావభావాలు చూస్తే నవ్వొస్తుందన్నారు. అన్న చిరంజీవిని అడ్డుపెట్టుకుని సినిమా యాక్టర్ అయ్యాడని చెప్పారు. ఇప్పుడు మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. పవన్ కన్నా ఆయన అన్నకొడుకు మంచి నటుడని వ్యాఖ్యానించారు. కత్తి మహేష్ లాంటి వాళ్లను మీడియానే పైకి లేపిందని చెప్పారు.

బీజేపీతో తెంచుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికే నష్టమని హెచ్చరించారు. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బీజేపీలో ఇమడలేడని వ్యాఖ్యానించారు. తమ పార్టీలో క్రమశిక్షణ ఎక్కువని, వ్యక్తిగత దూషణలకు పార్టీలో తావులేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కేంద్రంతో డూప్ ఫైటింగ్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసామని వెల్లడించారు. బుధవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా టూర్ పై చర్చిస్తామని, ఇక మీదట అమిత్ షా తరచూ తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు.

 

 

Similar News