రిలయన్స్ జియో మరో కొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. ఇప్పటికే న్యూఇయర్ కానుకగా రెండు అదిరిపోయే ప్లాన్లను ప్రారంభించిన రిలయన్స్ జియో... మరో క్యాష్‌బ్యాక్ ఆఫర్ తో ముందుకొచ్చింది. 'సర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్' పేరుతో జియో తన కస్టమర్ల కు ఈ ఆఫర్ అందించనుంది. రూ.399 లేదా ఆపై అన్ని రీఛార్జ్‌లపై రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది జనవరి 15 వరకు రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ సర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందని కంపెనీ చెబుతోంది. రూ.399 రీఛార్జ్‌పై జియో అందిస్తున్న రూ.2599 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు సోమవారంతోనే గడువు ముగిసింది.
ఈ నేపథ్యంలో మరో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో జియో తన కస్టమర్ల ప్రవేశపెట్టింది.''రూ.399, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రూ.3,300 వరకు జియో సర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ.400 మైజియో క్యాష్‌బ్యాక్ ఓచర్లు, వాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ ఓచర్లు, ఈ-కామర్స్ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్ ఓచర్ల రూపంలో ఆఫర్ చేస్తుంది'' అని కంపెనీ వర్గాలు తెలిపాయి. 2017 డిసెంబర్ 26 నుంచి 2018 జనవరి 15 వరకు మధ్యలో చేయించుకున్న అన్ని రీఛార్జ్‌లకు ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉండనుందని పేర్కొన్నాయి.