టాలీవుడ్ లో కొత్త కథలతో ప్రయోగం చేయటంలో నాని ముందు వరసలో ఉంటారు. అందుకే వరస పెట్టి హిట్స్ అందుకుంటూ దూసుకెళుతున్నారు. ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. నిర్మాతే కాదు...ఆ సినిమాలో నాని కూడా నటిస్తున్నారు. నాని ఒక్కరే అనుకుంటే పొరపడినట్లే. చాలా మంది నటీ, నటులు ఇందులో కన్పించబోతున్నారు. ఆ సినిమానే అ. దీనికి సంబంధించిన టీజర్ ను గురువారం నాడు విడుదల చేశారు. వచ్చే నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త సినిమా అ టీజర్ విభిన్నంగా..వినూత్నంగా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్క్ కె రోబిన్ సంగీతమందిస్తున్నాడు.ఈ సినిమాలో రవితేజ, నాని, అవసరాల శ్రీనివాస్ తోపాటు నిత్యామీనన్, కాజల్, రెజీనా, ఈషా, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాని సినిమాల తరహాలోనే ఈ టీజర్ కూడా డిఫరెంట్ ఉంది. మీరూ ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=UWDoD5Hkwog