విదేశీ అభిమానులకు పవన్ థ్యాంక్స్

Update: 2018-01-04 05:08 GMT

విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ..చదువుకుంటున్న తెలుగువారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. దేశం కాని దేశంలో ఉద్యోగం చేయటం..చదువుకోవటం ఎంత కష్టమో తనకు తెలుసన్నారు. తన కొత్త సినిమా అజ్ఞాతవాసి విడుదల సందర్భంగా ఆయన విదేశాల్లోని అభిమానుల కోసం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గతంలో ఏ భారతీయ సినిమా రిలీజ్ చేయనంత భారీగా అజ్ఞాతవాసి సినిమాను ఓవర్ సీస్ లో రిలీజ్ చేయనుండటం సంతోషంగాను..ఆశ్చర్యంగాను ఉందన్నారు.

‘పద్దెనిమిదేళ్ల క్రితం బద్రి సినిమా కొన్ని సెంటర్లలో రిలీజ్ అయితేనే అది పెద్ద విజయంగా భావించాం. ఇప్పుడు అజ్ఞాతవాసి ఇంత భారీగా రిలీజ్ అవ్వటం ఆనందంగా ఉంద’న్నారు పవన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. మరో వైపు అజ్ఞాతవాసి సినిమా కథ ఓ విదేశీ సినిమా నుంచి కాపీ కొట్టారనే ఆరోపణలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Similar News