ఢిల్లీలో సినీ నటి సామూహిక అత్యాచారానికి గురైన ఘటన మరవక ముందే అలాంటిదే మరో ఘటన. అయితే ఇందులో పాత్రదారి కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే కావటం విశేషం. కన్నడ హీరో ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. సుబ్రమణ్యం అనే కన్నడ నటుడు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసినట్టు 23 ఏళ్ల యువతి బసవగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజాజీనగర్‌కు చెందని యువతి, సుబ్రమణ్యం రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరద్దరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు.
అయితే చిత్ర షూటింగ్ ముగిసిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. అయితే నవంబర్ 1న తన అక్క ఇంట్లో పార్టీ ఉందని చెప్పి ఆ యువతిని సుబ్రమణ్యం పిలిపించాడు. అక్కడ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతి నిలదీయడంతో త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. కానీ ఇపుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం సుబ్రమణ్యం కోసం గాలింపు చేపట్టారు.