లైంగిక వేధింపులకు వాళ్ళ స్టేటస్ ...హోదా ఏ మాత్రం అడ్డు రావు అని చాటిచెప్పే ఘటన ఇది. అది ఎంత పెద్ద సినీ నటులు కావచ్చు...ఏ హోదాలో అయినా ఉండొచ్చు..చాలా మంది లైంగి క వేధింపుల బారినపడ్డవారే. అలాంటి విషయాలను వాళ్ళే ఈ మధ్య బహిరంగంగా చెప్పారు. ఫేస్‌బుక్ స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సోదరి ర్యాండి జుకర్‌బర్గ్ తాజాగా విమానంలో లైంగిక వేధింపులకు గురైంది. లాస్ ఏంజెల్స్ నుంచి మెక్సికోలోని మజత్లాన్ వెళుతున్న విమానంలో ఆమెను తోటి ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. దీనిపై ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా.. నిరక్యంగా వ్యవహరించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్టు అలస్కా ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటించింది. ఫేస్‌బుక్ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన ర్యాండీ ఒక లేఖలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని విమానాయాన సంస్థ దృష్టికి తీసుకెళ్ళింది.
ఫస్ట్ క్లాస్ సెక్షన్‌లో తనకు సమీపంలో కూర్చున్న వ్యక్తి ప్రవర్తన చాలా చిరాకు తెప్పించిందని, అతడు తనపై, ఇతర ప్రయాణికులపై లైంగికమైన, అసభ్యమైన దుర్భాషలు చేశాడని, పలుసార్లు మద్యం సేవించాడని ఆమె తెలిపింది. తనను తాకాలంటూ, తోటి ప్రయాణికుడంటే నీకు మోజు లేదా అంటూ, మహిళ ప్రయాణికుల శరీరాలపై అతను అసభ్య వ్యాఖ్యలు చేశాడని, దీనిపై ఫ్లయిట్ సిబ్బందికి ఫిర్యాదుచేసినా.. అతను రెగ్యులర్ ప్రయాణికుడు అంటూ చాలా తేలికగా స్పందించారని, కావాలంటే తనను సీటు మారాలని సూచించారని, వేధింపులకు గురైన తానెందుకు సీటు మారాలనే ఉద్దేశంతో తాను తన సీటు నుంచి మారలేదని ర్యాండీ తెలిపారు.