న్యూయర్ కు అక్కడ ఏమి చేస్తారో తెలుసా?

Update: 2017-12-30 06:01 GMT

ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలకు రంగం సిద్ధం అయింది. చాలా మంది ఎక్కడికి అక్కడ నూతన సంవత్సర వేడుకలకు రెడీ అయి అయ్యారు. అయితే కొంత మంది మాత్రం తమ నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకునేందుకు చెక్కేశారు. ఎవరి ఇష్టాలకు అనుగుణంగా వారు తమ ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. సహజంగా దుబాయ్ అంటేనే హంగామాగా ఉండే ప్రాంతం. పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఈ సారి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దుబాయ్ లోని ఉన్న ‘బుర్జ్ ఖలీఫా’ వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అదేంటి అంటే ప్రతి ఏటా ఇక్కడ భవనం కింద నుంచి పై వరకూ క్రాకర్స్ సందడి ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం క్రాకర్స్ కాకుండా లేజర్ షో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ క్రాకర్స్ షో అయినా...లేజర్ షో అయినా పర్యాటకులకు కనువిందు చేయటం ఖాయంగా కన్పిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసే లేజర్ షో గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా ఎక్కనుంది. అంతగా ప్లాన్ చేస్తున్నారు అక్కడ మరి. లేజర్ షోకు మ్యూజిక్ ను కూడా జతచేయనున్నారు. ట్విట్టర్ లో ఈ షోను లైవ్ స్ట్రీమ్ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. క్రాకర్స్ కంటే లేజర్ షో ఎంతో సురక్షితంగా ఉండటంతో పాటు..పాత పద్దతులకు స్వస్తి పలికి కొత్త మోడల్ లో సంబరాల నిర్వహణకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు బుర్జ్ ఖలీఫా నిర్వాహకులు చెబుతున్నారు.

 

Similar News