ఏంటి..కామోడీ అనుకుంటున్నారా?. కాదండి బాబూ నిజం. అదీ స్టార్ హోటల్ ను దలదన్నే సౌకర్యాలతో నెలకొల్పారు ఆ హోటల్ ని. ఆ..అది ఎక్కడో విదేశాల్లో అనుకుంటున్నారేమో..మీరు పొరపడినట్లే. భారత్ లోనే ఈ కుక్కల ప్రత్యేక హోటల్ ఉంది మరి. భారత్ లో ఈ తరహా హోటల్ ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి కూడా. ఇది ఎక్కడ ఉంది అంటారా?. ఢిల్లీకి సమీపంలో గురుగావ్ లో ఈ హోటల్ రెడీ అయింది. ఈ కుక్కల హోటల్ అయిన క్రిట్టెరెటీలో స్పాతో పాటు స్విమ్మింగ్ పూల్, కుక్కల కోసం స్పెషల్ కేఫ్ ఉన్నాయి.
ఈ హోటల్ సూట్స్ లో సౌకర్యవంతమైన బెడ్స్ తోపాటు టెలివిజన్లు కూడా ఏర్పాటు చేశారు. ఓ పక్క మనుషులకే సరైన సౌకర్యాలు లేని ఈ దేశంలో ఏకంగా స్టార్ హోటల్ తరహా సౌకర్యాలతో ప్రత్యేకంగా కుక్కల కోసం హోటల్ కట్టడం వింతగానే ఉంది కదా. కానీ ఏమీ చేయలేం. డబ్బున్న వాడి కుక్కల పరిస్థితి మనుషుల కంటే బెటర్ అని దీన్ని బట్టి తేలింది.